: నౌక ప్రమాదం ఘటనలో 54కి చేరిన మృతుల సంఖ్య
దక్షిణ కొరియాలో ప్రమాదవశాత్తు నౌక మునిగిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 54కి చేరింది. మొత్తం 476 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ నౌక ఈ నెల 16వ తేదీన ప్రమాదానికి గురై మునిగిపోయింది. హుటాహుటిన సహాయకచర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది ఓడ నుంచి 174 మందిని రక్షించారు. ఇంకా 248 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.