: ఇలాంటి సంఘటనలు దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయి: సింగపూర్ ప్రధాని
విదేశాల్లో సింగపూర్ ప్రజలు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని, అలాగే విదేశీయులు సింగపూర్ లో ఆనందంగా ఉండేలా ప్రజలు సహకరించాలని ఆ దేశ ప్రధాని లీ సూచించారు. సింగపూర్ లో ఫిలిప్పీన్స్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్న విదేశీయులను కొందరు వేధించినట్టు వచ్చిన వార్తలు తనను బాధించాయని ఆయన ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని ఆయన స్పష్టం చేశారు.