: వైఎస్సార్సీపీకి క్రైస్తవులు ఓటేయొద్దు: క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక
క్రైస్తవులను వైఎస్సార్సీపీ నేతలు మోసం చేశారని రాష్ట్ర క్రైస్తవ సామాజిక ఐక్యవేదిక కరపత్రం విడుదల చేసింది. బైబిల్ నియమావళికి వ్యతిరేకంగా జగన్ దోచుకున్నారని ఈ కరపత్రంలో పేర్కొన్నారు. బెంగళూరు, లోటస్ పాండ్ లలో విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారని వారు కరపత్రంలో పేర్కొన్నారు. క్రైస్తవులను ఓట్ల కోసం వాడుకుని విజయమ్మ వదిలేశారని, అందుకే ఆ పార్టీకి ఓటు వేయవద్దని క్రైస్తవ సామాజిక ఐక్యవేదిక పేర్కొంది. విజయమ్మ ఇచ్చిన హామీలను విస్మరించారని ఐక్యవేదిక కరపత్రంలో ఆరోపించింది.