: విశాఖలో వేల కోట్లు తినేశారు: అనూరాధ
వైఎస్సార్సీపీ నేతలు విశాఖపట్టణంలో వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించారని విజయవాడ టీడీపీ నేత అనూరాధ తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, విశాఖతో సంబంధం లేని విజయమ్మ అక్కడ్నుంచి పోటీ చేయడమేంటని ప్రశ్నించారు. రాయలసీమను దోచుకున్న వారి చూపు విశాఖ మీద పడిందా? అని ఆమె నిలదీశారు.