: మంగళగిరి టీడీపీలో విభేదాలు


టికెట్ల రగడ టీడీపీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి ఈ ఉదయం గంజి చిరంజీవి పేరు ఖరారు చేయగా వెంటనే అధినేత చంద్రబాబు బి-ఫారం కూడా ఇచ్చారు. అయితే, అక్కడి స్థానిక ఇంఛార్జి పోతినేని శ్రీనివాస్ రెడ్డిని కాదని ఆయనకెలా ఇస్తారంటూ పోతినేని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తనను కలిసేందుకు వచ్చిన చిరంజీవిని పోతినేని గదిలో బంధించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. అటు పోతినేని-చిరు వర్గీయులు బాహాబాహికి దిగారు.

  • Loading...

More Telugu News