: సమైక్యభావాన్ని కాపాడుకునేందుకే పోటీ చేయడం లేదు: కిరణ్
పీలేరు ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న జేఎస్పీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి తన అంతరంగాన్ని బయటపెట్టారు. సమైక్య వాదాన్ని వినిపిస్తున్న తనకు పదవులు అడ్డొస్తాయని... అందుకే తాను ఏ పదవుల కోసం పోటీ చేయాలనుకోలేదని చెప్పారు. పీలేరు ఓటర్ల అనుమతి లేకుండా తాను ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున తనను క్షమించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రమంతా తిరిగి... జై సమైక్యాంధ్ర గెలుపుకోసం పాటుపడాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. తాను ఎక్కడకూ పోనని... తెలుగు జాతిని కాపాడుకునేందుకు ఇక్కడే ఉంటానని చెప్పారు.