: అనారోగ్యానికి గురైన నేతను పరామర్శించిన బాలకృష్ణ
హిందూపురంలో గత మూడు రోజులనుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు నియోజకవర్గంలోని పలువురు నేతలతో భేటీ అయ్యారు. అంతేకాకుండా అనారోగ్యానికి గురైన మాజీ ఎమ్మెల్యే సి.కె.వెంకట్రాముడు ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గం నుంచి తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ఆత్వవిశ్వాసం వ్యక్తం చేశారు.