: రేపు రైలు రిజర్వేషన్ కార్యకలాపాలకు అంతరాయం


ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొత్త పరిజ్ఞానానికి సంబంధించిన ప్రయోగాలు చేపడుతున్నందున రేపు రైలు రిజర్వేషన్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రిజర్వేషన్ సేవలు నిలిపివేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమయంలో రిజర్వేషన్ కేంద్రాల్లో కంప్యూటరీకరించిన టికెట్ల జారీతో పాటు కరెంట్ బుకింగ్ కేంద్రాల్లో టికెట్ల జారీ ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ లో దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, నైరుతి రైల్వే మండలాలకు సంబంధించిన రైళ్లకు రిజర్వేషన్ టికెట్ల విక్రయాలను నిలిపివేయనున్నట్టు చెప్పారు. ఈ అసౌకర్యాన్ని ముందుగానే గుర్తించి సహకరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News