: చెన్నైపై 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఘనవిజయం


చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించిన పంజాబ్ జట్టు ఐపీఎల్-7లో బోణీ కొట్టింది. మాక్స్ వెల్ 43 బంతుల్లో 95 పరుగులు చేసి చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీని చేజార్చుకున్న మాక్స్ వెల్ జట్టును మాత్రం విజయపథాన నిలిపాడు. 54 పరుగులతో మిల్లర్ నాటౌట్ గా నిలిచాడు. సెహ్వాగ్ (19), బెలీ (17-నాటౌట్), పూజారా (13) జట్టుకు అండగా నిలవడంతో భారీ లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలోనే చేధించింది. అశ్విన్ - 2 వికెట్లు, నెహ్రా, స్మిత్ చెరొక వికెట్ తీశారు. పంజాబ్ స్కోర్ 206/4, చెన్నై స్కోర్ 205/4.

  • Loading...

More Telugu News