: ఖైరతాబాదులో దానం విస్తృత ప్రచారం
మాజీ మంత్రి దానం నాగేందర్ ఖైరతాబాదులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన ఇవాళ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు మంచి జరుగుతుందని అన్నారు. తాము చేసిన అభివృద్దే తమను అధికారంలోకి తెస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.