: బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ సర్వీసుల సామర్థ్యం తరుగుదల
మన దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ వారు అందిస్తున్న ఇంటర్నెట్ సేవలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. తమ సేవల ఇంటర్నెట్ సామర్థ్యం 21 శాతం పడిపోయినట్లు సంస్థ ప్రకటించింది. మనదేశంనుంచి అనేక ఇతరదేశాలను అనుసంధానించే సముద్రగర్భ కేబుల్స్ పలుచోట్ల తెగడం వలన ఈ ఇబ్బంది వచ్చినట్లుగా సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ గేట్‌వేగా పనిచేస్తున్న మూడు ప్రధాన కేబుల్స్ పలుచోట్ల దెబ్బతినడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తినట్లు వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.