: టీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ పార్టీ: జైరాం రమేష్
టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే శాంతియుత పరిస్థితులు ఉంటాయని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆయన ఇవాళ హైదరాబాదు, ఇందిరాభవన్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా జైరాం రమేష్ టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ పార్టీ అని, ప్రజలను రెచ్చగొట్టడం, వివాదాలు సృష్టించడం ఆ పార్టీ ఎజెండా అన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి పలు హామీలు విభజన చట్టంలోనే ఉన్నాయని జైరాం రమేష్ తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయాల్సిందేనన్నారు.