: స్నేహితుడు ఎక్కడున్నాడో ఫేస్ బుక్ ను అడిగితే సరి
మీ స్నేహితుడు మీరున్న చోటుకు దగ్గర్లోనే ఉన్నాడనుకోండి. అతడు చెప్పకపోయినా ఫేస్ బుక్ ను అడిగితే చాలు చెప్పేస్తుంది. డిఫాల్ట్ లొకేషన్ కాకుండా వాస్తవానికి ఫేస్ బుక్ లో యాడ్ అయిన స్నేహితులు ఎవరైనా సమీపంలో ఉంటే ఇకపై ఫేస్ బుక్ చెప్పేయగలదు. అదీ అరమైలు దూరం వరకు ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఈ సదుపాయాన్ని ఫేస్ బుక్ నిన్నటి నుంచి అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది.