: కాంగ్రెస్ ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు:గాలం
కాంగ్రెస్ తనను ఇలా మోసం చేస్తుందని అనుకోలేదని గాలం లక్ష్మి అభిప్రాయపడ్డారు. గాలం లక్ష్మీయాదవ్ అభ్యర్థిత్వాన్ని అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ మార్చడాన్ని తప్పుపట్టారు. అద్దంకిలో మాట్లాడుతూ, 1983లో కూడా తన తండ్రి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇలాగే మార్చిందని, రెండు సార్లు తమను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. అద్దంకి అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో గాలం లక్ష్మీయాదవ్ పేరును ప్రకటించి బీఫాం ఇచ్చింది. తాజాగా ఈ సీటును ఈద సుధాకర్ రెడ్డికి కేటాయిస్తూ బీఫాం ఇచ్చింది.