: చిదంబరానికి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేదు: బీజేపీ


కేంద్ర మంత్రి చిదంబరానికి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదంటూ బీజేపీ నేత స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. ఆయనకు నిజంగా సత్తానే ఉంటే ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు కోరాలని సూచించారు. చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారని, ప్రజల ముందుకు వెళితే సమాధానం చెప్పాల్సి వస్తుందని, అందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె దుయ్యబట్టారు. మోడీపై నిన్న చిదంబరం విమర్శలతో దాడి చేయడంతో, స్మృతి ఇరానీ ఇలా ప్రతిస్పందించారు. ప్రస్తుతం చిదంబరం ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడులోని శివగంగ స్థానం నుంచి ఆయన కొడుకు కార్తీ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News