: ఆగస్టు నుంచి పీఎఫ్ చెల్లింపులన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే


భవిష్య నిధి (పీఎఫ్) క్లెయిములు సహా తన లబ్ధిదారులకు అన్ని చెల్లింపులను సెప్లెంబరు నుంచి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరపాలని న్యూఢిల్లీలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. అలాగే ఈపీఎఫ్ఓ తన క్రియాశీల సభ్యులందరికీ శాశ్వత లేదా సార్వజనిక ఖాతా సంఖ్యను అక్టోబరుకల్లా అందించాలని కూడా యోచిస్తోంది. ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ, ఆగస్టు 31 కల్లా 100 శాతం ఈ-పేమెంట్ ను ఆచరణలోనే తీసుకురావాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం సుమారు 93 శాతం ప్రయోజనాలు ఎలక్ట్రానిక్ విధానంలో బదిలీ అవుతున్నాయన్నారు. ఈ సదుపాయంలో భాగంగా పీఎఫ్ విత్ డ్రాయల్స్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి.

  • Loading...

More Telugu News