: గుడివాడ వైకాపా నాయకురాలు ధనలక్ష్మి అరెస్ట్
కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ నాయకురాలు ధనలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంలో, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంచుతూ ఆమె పట్టుబడ్డారు. ఆమెతో పాటు ఆమెకు సంబంధించిన మరో నలుగురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, ఓటు వేసేందుకు డబ్బు తీసుకున్న ఆరు మంది ఓటర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నేడు గుడివాడ కోర్టులో ప్రవేశపెడుతున్నారు.