: సార్వత్రిక ఎన్నికల్లో ముగిసిన ఐదో దశ పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పలు లోక్ సభ నియోజకవర్గాల్లో ఐదో దశ పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ రోజు 12 రాష్ట్రాల్లో 121 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వివిధ పార్టీలకు చెందిన 1762 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.15 లక్షల కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. 3.5 లక్షల ఈవీఎంలను ఉపయోగించారు. 14 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.