: అధికారాన్ని టీఆర్ఎస్ కు అప్పగిస్తేనే అభివృద్ధి: కేసీఆర్
గత 50 ఏళ్లుగా ఎలా ఉన్న కరవు అలాగే ఉందని... పదవుల్లో ఉన్న పెద్ద నాయకులు నీళ్లు తెద్దామని కూడా ప్రయత్నించలేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో నీళ్లు రావడం లేదని అన్నారు. మిడ్ మానేరు తదితర ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిందే అని చెప్పారు.