: పెళ్లినాటికి మోడీ మైనర్ కాదు... మేజరే: నగ్మా
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పెళ్లి గురించి కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి నగ్మా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెళ్లినాటికి మోడీ మైనరే అన్న వార్తలు పచ్చి అబద్దాలని... ఆ సమయానికి మోడీ మేజరనడానికి ఆధారాలున్నాయని తెలిపింది. ఎన్నికల సమయంలో మోడీ పెళ్లిని ఇష్యూ చేయడం తప్పేమీ కాదని... గతంలో దాఖలు చేసిన అఫిడవిట్లలో తన పెళ్లి విషయాన్ని మోడీ ఎందుకు దాచారని ప్రశ్నించింది. మోడీ గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ఆయన భార్య జశోదా అత్యున్నతమైన వ్యక్తి అంటూ కొనియాడింది.