: 12 మంది రెబల్స్ పై తెలంగాణ కాంగ్రెస్ వేటు


పార్టీ ఆదేశాలను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన పన్నెండు మంది రెబల్స్ పై తెలంగాణ కాంగ్రెస్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

బహిష్కరణకు గురయిన వారిలో... ఆదిలాబాద్ -అమీనా ఖాన్, కల్వకుర్తి - కాశిరెడ్డి నారాయణ రెడ్డి, బెల్లంపల్లి - చిలుమోల శంకర్, ఇబ్రహీంపట్నం - మల్ రెడ్డి రామ్ రెడ్డి, మునుగోడు -పాల్వాయి కుమార్తె స్రవంతి, రామగుండం - కౌశిక్ హరినాథ్, పాలకుర్తి - లక్ష్మీ నారాయణ నాయక్, నిజామాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార, కోరుట్ల - నర్సింగరావు, హుజూరాబాద్ - భీమ్ రావు, యాకుత్ పురా - ఖాసిం ఖాన్, మక్తల్ -సుగూరప్ప.

  • Loading...

More Telugu News