: 'ఆప్' విజయవాడ లోక్ సభ అభ్యర్థికి షోకాజ్ నోటీసు


ఆమ్ ఆద్మీ పార్టీ తరపున విజయవాడ నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హర్మొహిందర్ సింగ్ సాహ్నీ, మరో ముగ్గురికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి జె.మురళి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ముందస్తు అనుమతి లేకుండా వారు పోస్టర్లు, కరపత్రాలను పంచేందుకు ప్రయత్నించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందునే 127ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇందుకు ఎవరైనా ముందు అనుమతి తీసుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News