: 19న నామినేషన్ వేయనున్న సినీ నటి హేమ


సినీ నటి హేమ రాజకీయ అరంగేట్రం చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థినిగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి రంగం సిద్ధమైంది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ జేఎస్పీ అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీ హర్షకుమార్ వెంట ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమ మీడియాతో మాట్లాడుతూ... మండపేట అసెంబ్లీ జేఎస్పీ అభ్యర్థిగా తాను 19న నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. సమైక్యాంధ్ర పరిరక్షణ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె అన్నారు. మునుపెన్నడూ రాజకీయాల్లో తాను పాల్గొనలేదని, అయితే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తనను గెలిపిస్తే మండపేటలోనే ఉంటానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హేమ హామీ ఇచ్చారు. తన సొంతూరు రాజోలు అని, తొలి నుంచి జిల్లాతో, ఇక్కడి ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News