: అధినేత తరపున కాసేపట్లో నామినేషన్ వేయనున్న లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున ఆయన కుమారుడు, టీడీపీ యువ నేత లోకేష్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. లక్ష్మీపురం వరదరాజస్వామి దేవాలయంలో పూజలు చేసిన లోకేష్ ర్యాలీగా బయల్దేరారు. లోకేష్ ర్యాలీలో పాల్గొనేందుకు కుప్పం నియోజకవర్గానికి చెందిన నేతలు భారీగా తరలి వచ్చారు.