: ఐపీఎల్ పదనిసలు...కోహ్లీని ఇరికించిన షారూఖ్


ఐపీఎల్ అట్టహాసంగా ఆరంభమైంది. ఐపీఎల్ ఆరంభవేడుకల్లో షారూఖ్ ఖాన్ టీమిండియా యువ సంచలనం విరాట్ కోహ్లీని ఇరికించేశాడు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్కశర్మతో డేటింగ్ లో ఉన్న విషయాన్ని జాతీయ మీడియా పుంఖానుపుంఖాలుగా ప్రచురిస్తోంది. దీంతో అనుష్కతో కోహ్లీ బంధం ఏంటన్నది ప్రపంచానికి చెప్పాలనుకున్నాడో, లేక కోహ్లీని ఆటపట్టించాడో కానీ బాలీవుడ్ బాద్షా స్వయంవరం నిర్వహించి ఇరికించేశాడు. కోహ్లీని స్వయంవరంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించాడు షారూఖ్ ఖాన్.

దీంతో స్టేజ్ పై కి వెళ్లిన విరాట్ ను నీకెలాంటి భార్య కావాలి? అమ్మాయిల్లో ఎలాంటి అంశాలు ఆకట్టుకుంటాయి? అంటూ పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టాడు. తరువాత నలుగురు అమ్మాయిలను చూపించి అందులో ఇద్దర్ని ఎంచుకోమన్నాడు. అందులో ఒకర్ని ఎంచుకోమనగా ఆమె చేతిలో ఉన్న ప్యాకెట్ లో అనుష్క శర్మ ఫోటో వచ్చింది. ఆ ఫోటోని షారూఖ్ ఖాన్ కోహ్లీ మెడలో వేసి స్వయంవరం ముగిసిందని ప్రకటించాడు. దీంతో కోహ్లీ సిగ్గుల మొగ్గయిపోయాడు.

  • Loading...

More Telugu News