: విశాఖ అంటే వైఎస్ కు మహాప్రీతి: కొణతాల
విశాఖపట్టణం అంటే దివంగత నేత వైఎస్సార్ కు మహా ప్రీతి అని వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ తెలిపారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ, తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖను మరింత అభివృద్ధి పథంలో జగన్ నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే విశాఖపై మేనిఫెస్టోలో ప్రస్తావించారని అన్నారు. ఈ ప్రాధాన్యతా క్రమంలో భాగంగా విజయమ్మను విశాఖ నుంచి బరిలో నిలిపారని ఆయన తెలిపారు. విశాఖను ప్రపంచపటంలో నిలిపే ప్రణాళికలు జగన్ రచించారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సంక్షోభం నుంచి బయటపడడానికి జగన్ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. సీమాంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే విజయమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన సూచించారు.