: ప్రియాంక గాంధీకి పిన్నమ్మ సలహా
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై దృష్టి పెట్టమని ప్రియాంక గాంధీకి పిన్నమ్మ మేనకా గాంధీ సలహా ఇచ్చారు. ఫిలిబిత్ లో ఆమె మాట్లాడుతూ, 2014 ఎన్నికలు మన రెండు కుటుంబాల మధ్యో, లేక ఆక్కా, తమ్ముళ్ల మధ్యో పోటీ కాదని హితవు పలికారు. ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ వరుణ్ గాంధీ బీజేపీ తరపున పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోందని ఆమె అన్నారు.
ప్రియాంక గాంధీ మాటలు కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక వైఖరిని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్న ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో ఏ సిద్ధాంతాలు పాటిస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు అన్ని విషయాలను ప్రతిఫలిస్తాయని మేనక గాంధీ అన్నారు.