: లగడపాటి రాజగోపాల్ పై కేసు నమోదు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై కేసు నమోదైంది. వేర్పాటు వాదులు దేశం విడిచి వెళ్లాలి అన్న ఆయన వ్యాఖ్యలపై కొద్దిరోజుల కిందట రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాది ఉపేందర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు విచారణ నిర్వహించి, కేసు నమోదు చేయాలంటూ చైతన్యపురి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో లగడపాటిపై సెక్షన్ 121, 153, 153 (ఎ) సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంతేగాక మార్చి 7లోగా నివేదిక అందజేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.