: పవన్ కల్యాణ్ తో పొట్లూరి భేటీ


టీడీపీ తరపున విజయవాడ లోక్ సభ టికెట్ ఆశించి భంగపడ్డ పొట్లూరి వరప్రసాద్ పవన్ కల్యాణ్ తో ఈ రోజు భేటీ అయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా విజయవాడ లోక్ సభ స్థానానికి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయపై పవన్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ లోక్ సభ స్థానం కోసం స్థానిక నేత కేశినేని నాని ముందు నుంచీ పోటీలో ఉన్నారు. టికెట్ కూడా ఆయనకే దాదాపుగా ఖరారైంది. అయితే, పొట్లూరి వరప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించడంతో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. కేశినేనిని శాసనసభకు పోటీ చేయాలని చంద్రబాబు సూచించినా ఆయన ఒప్పుకోకపోవడంతో విజయవాడ లోక్ సభ టికెట్ ఆయనకివ్వక తప్పలేదు. దీంతో తన పోరాటం, పవన్ సూచన ఫలించకపోవడంతో పొట్లూరి, ఆయన వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన వర్గీయులు కొందరు మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ తో చర్చల తర్వాత పొట్లూరి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News