: ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే కాదనను: బాలయ్య
హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గాన్ని నంబర్ వన్ గా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్కడ బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని తెలిపారు. అనంతపురం జిల్లాకు తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పారు. అయితే, ఏవో పదవులు ఆశించి తాను రాజకీయాల్లో రాలేదని, ముఖ్యమంత్రిగా చేసేందుకు అవకాశం వస్తే మాత్రం కాదనని బాలయ్య మనసులో మాట చెప్పారు.