: ఓటేసే ముందు రాజన్న రాజ్యాన్ని గుర్తుతెచ్చుకోండి: విజయమ్మ
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు జగన్ వల్లే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల శంఖారావం పూరించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో విజయమ్మ రోడ్ షో నిర్వహించారు.
రోడ్ షోలో విజయమ్మ మాట్లాడుతూ... ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆకాంక్షించాలని, ఓటేసే ముందు ఒక్కసారి రాజన్న రాజ్యాన్ని గుర్తు తెచ్చుకోవాలని ప్రజలను కోరారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం చింతలపూడిలో జరిగే జనభేరి సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు.