: నడుస్తున్న కారు బుగ్గైపోయింది


కాణిపాకం వెళుతున్న భక్తుల కారు అగ్నికి ఆహూతైపోయింది. విశాఖకు చెందిన సత్యన్నారాయణ కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఈ ఉదయం కాణిపాకం ప్రయాణమయ్యారు. చంద్రగిరి-చిత్తూరు రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో వారి కారులో ఒక్కసారిగా మంటలు తలెత్తాయి. డ్రైవరు వెంటనే కారు ఆపగా అందులోని వారు దిగిపోయారు. మంటలను అదుపు చేసేలోపే పూర్తిగా కారు దహనమైపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి చివర్లో మంటలను ఆర్పేశారు. ఈ ఘటనతో ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News