: ఐటీపీఎల్ లో భాగమవుతున్న సచిన్!


ఇటీవల ఇండియన్ సూపర్ లీగ్ లో కొచ్చి ఫ్రాంఛైజీనీ సొంతం చేసుకున్న సచిన్ టెండుల్కర్ తాజాగా ఐటీపీఎల్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్)పై మనసు పారేసుకున్నాడు. దాంతో, ఇందులోని ముంబయి ఫ్రాంఛైజీని తీసుకున్నాడట. తమిళనాడుకు చెందిన మీడియా కంపెనీ పీవీపీ గ్రూప్ తో కలసి ఈ ఫ్రాంఛైజీకి సచిన్ సహ యజమానిగా వ్యవహరిస్తాడు. ఈ మేరకు పీవీపీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ, సచిన్ వంటి లెజెండ్ తో కలసి భాగస్వామ్యం అవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఐబీఎల్ లో హైదరాబాదు జట్టు, ఇప్పుడు ఐటీపీఎల్ లో ఇండియన్ ఫ్రాంఛైజీ లో ఇన్వెస్టు చేస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News