: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా సాగింది: షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా సాగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా ముల్కలపల్లికి వచ్చిన షర్మిల రోడ్ షోలో పాల్గొన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా నిలవాల్సిన టీడీపీ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ కు రక్షణ కవచంగా నిలవటం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసే ముందు ఒక్కసారి వైఎస్సార్ ను గుర్తు తెచ్చుకుని సీలింగ్ ఫ్యాను గుర్తుకు ఓటేయాలంటూ ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అశ్వారావుపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తాటి వెంకటేశ్వర్లును, ఖమ్మం ఎంపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను గెలిపించాలని షర్మిల కోరారు.