: కొండగట్టుకు పోటెత్తిన హనుమాన్ భక్తులు
కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఇవాళ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది హనుమాన్ దీక్షాపరులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.