: కాంగ్రెస్ వల్ల దేశానికి తీరని నష్టం: మోడీ


ఇప్పటికే కాంగ్రెస్ వల్ల దేశానికి తీరని నష్టం జరిగిందని, ఇంకా నష్టపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ లోని భాగల్పూర్ లో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ సంజయ్ బారు పుస్తకం ప్రస్తావన తెచ్చారు. ఆ పుస్తకంలో అంశాలను ప్రధాని కుమార్తె తోసిపుచ్చేందుకు వీల్లేదని, అందులో మన్మోహన్ సింగ్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదని మోడీ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు మాటలకే పరిమితమయ్యారు కానీ చేతల్లో చేసిందేమీ లేదన్నారు. గిడ్డంగుల్లో ఆహార ధాన్యాలు కుళ్లిపోతున్నా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ విషయంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిజాయతీగా ఎవరు పనిచేస్తారో వారికే ఓటు వేయాలని మోడీ ప్రజలను కోరారు.

  • Loading...

More Telugu News