: విజయవాడ లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని ఖరారు
విజయవాడ లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని పేరు అధికారికంగా ఖరారైంది. వెంటనే నానికి చంద్రబాబు బి-ఫారం కూడా అందజేశారు. దాంతో, కొన్ని రోజుల నుంచీ నానికి టికెట్ ఇస్తారా? లేదా? అనే అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. కాగా, రేపు నాని నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం.