: తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఓట్ల నిర్మాణం కాదు: గద్దర్


తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కాస్తా రాజకీయ పార్టీగా మారడాన్ని పలువురు తెలంగాణ ఉద్యమ కారులు జీర్ణించుకోలేకపోతున్న విషయం బహిరంగ రహస్యం. తాజాగా దీనిపై ప్రజాగాయకుడు గద్దర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఓట్ల నిర్మాణం కాదన్నారు. సంపదలో నిర్మాణం జరగాలని చెప్పారు. అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన వాదిస్తున్నారు. పునర్నిర్మాణం కోసమైతే టీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరంలేదన్నారు. ఎవరో ఇస్తే, ఎవరో తీసుకువస్తే తెలంగాణ రాలేదని.. ప్రజా ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు.

  • Loading...

More Telugu News