: రఘువీరాను అడ్డుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిని ఇందిరా గాంధీ భవన్ దగ్గర అడ్డుకున్నారు. పార్టీకి ఎన్నో ఏళ్ల నుంచి సేవ చేస్తున్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ టికెట్ దక్కని నేతలు ఆయనపై చిందులు తొక్కారు. వారందర్నీ సముదాయిస్తూ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందంటూ ఆయన వారికి భరోసా ఇచ్చారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పటికీ తాము సేవ చేస్తున్నామని, అవకాశం వచ్చినప్పుడు కూడా తమను పట్టించుకోకపోతే ఎలా? అంటూ వారు ఆయనను నిలదీశారు.