: సీమాంధ్రలో మారిన సీను... టీడీపీ 15, వైకాపా 9: ఎన్డీటీవీ సర్వే రిపోర్ట్
సీమాంధ్రలో ఓటరు నాడి వేగంగా మారుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల తలరాతలు తలకిందులౌతున్నాయని ఎన్డీటీవీ నిర్వహించిన సర్వే తేటతెల్లం చేస్తోంది. ఫిబ్రవరిలో వైకాపాకు 15 లోక్ సభ సీట్లు, టీడీపీకి 9 సీట్లు వస్తాయని ఎన్డీటీవీ సర్వేలో తేలింది. కానీ, ఇప్పడు తాజాగా ఏప్రిల్ మొదటి వారంలో చేసిన సర్వేలో పరిస్థితి తారుమారైంది. టీడీపీ, బీజేపీ కూటమి 15 లోక్ సభ స్థానాల్లో విజయకేతనం ఎగరవేయనుంది. వైఎస్సార్సీపీకి 9 సీట్లు దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును గెలుచుకుంటుందని సర్వే తెలిపింది.