: హిజ్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని సుప్రీం ఆదేశం
దేశ వ్యాప్తంగా ఉన్న హిజ్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక వారిని మూడో కేటగిరీ కింద గుర్తించాలని ఆదేశాలిచ్చింది. విద్య, ఉద్యోగాల్లో హిజ్రాలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించిన న్యాయస్థానం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిగా కూడా హిజ్రాలను గుర్తించాలని తీర్పునిచ్చింది.