: కేసీఆర్ పర్యటన తేదీలు ఖరారు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న బహిరంగ సభల తేదీలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇక 16వ తేదీ (బుధవారం) మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు లోక్ సభ స్థానం పరిధిలోని వనపర్తిలో, అదే రోజు సాయంత్రం మహబూబ్ నగర్ పట్టణంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 17వ తేదీ(గురువారం) వరంగల్ లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 17వ తేదీ(శుక్రవారం) మెదక్ జిల్లా గజ్వేల్ లో జరిగే సభలో ప్రసంగిస్తారు.