: ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్ మాత్రమే: షర్మిల
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన రోడ్ షో కొనసాగుతోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ఈరోజు పాల్వంచలో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి కొంతమంది ప్రలోభాలకు గురి చేయడానికి యత్నిస్తారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఎవరూ కూడా ఆ ప్రలోభాలకు గురి కాకుండా వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్న మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తెలిసిన జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అన్న జగన్ తో పాటు తల్లి విజయమ్మ కూడా ప్రజల కోసం ఎన్నో దీక్షలు చేశారని ఆమె తెలిపారు.