: మోడీతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యం: వెల్లంపల్లి శ్రీనివాస్


విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, చిరంజీవి అనుచరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లి పేరు ప్రకటించినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కాషాయ కండువా కప్పుకున్నారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వెల్లంపల్లికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

విజయవాడలో ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర నష్టపోయిందని, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వల్లే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. మోడీ ప్రధాని అయితే సీమాంధ్రలో 13 జిల్లాలను అభివృద్ధి చేస్తారనే విశ్వాసం తనకు ఉందని వెల్లంపల్లి అన్నారు. బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా బీజేపీ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

  • Loading...

More Telugu News