: మందు ఒకటే ... ప్రయోజనాలు మాత్రం రెండు!


ఒక జబ్బు కోసం కనిపెట్టిన మందు మరొకందుకు కూడా ఉపయోగపడుతుండడం మనం అప్పుడప్పుడు చూస్తూనే వున్నాం. ఇది కూడా అలాంటిదే. టైప్ 2 మధుమేహానికి (డయాబెటీస్) ప్రముఖంగా వాడే మెటాఫార్మిన్ అనే మందు, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడమే కాకుండా, వార్ధక్యం రాకుండా కూడా కాపాడుతోందని అమెరికాలో జరిగిన తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

డైటింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ మందు సమకూరుస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల మనిషి ఆయుప్రమాణం పెరుగుతున్నట్టు రుజువైంది. మెటాఫార్మిన్ మందులో వార్ధక్యపు చాయలను నివారించే సుగుణాలు వున్నట్టు స్పష్టంగా తేలింది. అయితే, ఆ విషయంలో ఇది ఎలా పనిచేస్తోందనే అంశంపై మాత్రం ఇంకా పరిశోధనలు చేయాల్సివుందట.        

  • Loading...

More Telugu News