: కైకలూరు టిక్కెట్టు వెంకటరమణకు ఎందుకు ఇవ్వలేదు?
కృష్ణా జిల్లాలోని కైకలూరులో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. జయమంగళ వెంకటరమణకు టికెట్ ఇవ్వకపోవడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. వెంకటరమణ వద్దని వారించినా వారు వినిపించుకోలేదు. పార్టీకి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.