: గుంటూరు జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి


భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 124వ జయంత్యుత్సవ వేడుకలు గుంటూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి లాడ్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు వైఎస్సార్సీపీకే సాధ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News