: ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన నాకు లేదు: ప్రియాంక గాంధీ
వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని ప్రియాంకాగాంధీ స్పష్టం చేశారు. ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేయాలని భావించగా, కొంత మంది కాంగ్రెస్ పెద్దలు అభ్యంతరం చెప్పారని వచ్చిన వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. ఢిల్లీలో ఆమె ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను ఎవరూ ఆపడం లేదని అన్నారు.
తాను పోటీ చేస్తానంటే తన సోదరుడు రాహుల్ గాంధీ సహా కుటుంబం మొత్తం మద్దతుపలుకుతారని తెలిపారు. పోటీ చేయడం, చేయకపోవడం తన ఇష్టమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తన లక్ష్యం అమేథీ, రాయ్ బరేలి లోక్ సభ స్థానాల్లో తన తల్లి, సోదరుల గెలుపని ప్రియాంక గాంధీ తెలిపారు.