: 'పరమ చెత్త' అవార్డులకు అజయ్ దేవగణ్, సోనాక్షి
బాలీవుడ్ లో విజయవంతమైన చిత్రం 'సన్నాఫ్ సర్దార్' జోడీ అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హాలు 'పరమ చెత్త' నటులుగా ఎంపికయ్యారు. ఐదవ గోల్డెన్ కేలా అవార్డుల్లో భాగంగా 'పరమ చెత్త' నటుడు, 'పరమ చెత్త' నటి పురస్కారాలను 2012 ఏడాదికిగాను వీరిద్దిరికీ ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఇక 'పరమ చెత్త' చిత్రంగా శిరీష్ కుందర్ తీసిన 'జోకర్' ఎంపికైంది.
ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు కుందర్ ను 'పరమ చెత్త' డైరక్టర్ అవార్డు వరించింది. కాగా, సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్-2 చిత్రానికి 'పరమ చెత్త సీక్వెల్' అవార్డు దక్కింది. కాగా, ఈ అవార్డుల గురించి చెబుతూ, గత ఐదేళ్ళుగా సినిమాలపై ప్రేమతోనే ఈ పురస్కారాలు అందిస్తున్నామని, ఇది లాభాపేక్షతో నిర్వహిస్తున్న కార్యక్రమం కాదని 'గోల్డెన్ కేలా' వ్యవస్థాపకుడు జతిన్ వర్మ చెప్పారు.