: బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత వెల్లంపల్లి
విజయవాడ పశ్చిమ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున అదే స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ నరేంద్ర మోడీ అంటే అభిమానంతోనే సొంత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఆయన ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.